ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యావసర ధరల నియంత్రణపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు ఫౌరసరఫరాల శాఖపై ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఫౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు.
సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువల దిగుమతి, ధరల నియంత్రణకు దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రస్తుతం రైతు బజార్ల ద్వారా చేపట్టిన అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాటు తదితర విషయాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.