ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని, చట్టాన్ని ఉల్లంఘించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని, చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్‌కు రెడ్ బుక్‌లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు ఉందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఈ సందర్బంగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. యాక్షన్ అయితే అనివార్యమని, వైసీపీ వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే స్పష్టత లేదని.. కానీ తన నుంచీ ఇన్స్పైర్ అయ్యారని అర్ధమైందన్నారు. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయని, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.