టెక్కలి ఇందిరాగాంధీ కూడలి పరిధిలో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ కాలనీకి చెందిన కురమాన లక్ష్మి చేతిలో పర్సు పట్టుకొని వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి అపహరించారు. లక్ష్మి తన వద్ద తెగిపోయిన చైన్ అతికించేందుకు మార్కెట్‌లోకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పర్సులో మూడు వేల రూపాయల నగదు కూడా ఉన్నట్టు ఆమె తెలిపింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారాన్ని తెలియజేసింది. పోలీసులు ఆ ప్రాంతంలో వెతికేందుకు ప్రయత్నించినా దసరా సందడితో పట్టణం కిక్కిరిసి ఉండడంతో సీసీ కెమెరాల్లో సైతం పట్టుకోలేకపోయారు.