రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులకు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు. అరసవల్లి నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శుక్ర వారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడు తూ.. భావనపాడులో 3,500 ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి చంద్రబాబు సిద్ధమైతే, వైసీపీ ప్రభుత్వం 350 ఎకరాల భూమిని సేకరించి పోర్టు నిర్మాణం మొదలెట్టిం దని, అసలు 350 ఎకరాలు పూర్తిస్థాయి పోర్టు నిర్మాణానికి సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో కొండలు మింగి నీతులు చెప్పడం సీదిరి అప్ప లరాజుకే చెల్లిందని దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూలపేట పోర్టు పోర్టు పనులకు పాత కాంట్రాక్టరు ద్వారానే చేయిస్తున్నామని, అలాగే ఆరు నుంచి ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసి, విమానాశ్రమాన్ని తీసుకువచ్చి పూర్తి స్థాయి అభివృద్ధి చేసేందుకు విజన్-2047 డాక్యుమెంట్‌లో చేర్చామని తెలిపారు. అలాగే జిల్లాకు పారిశ్రామికవాడ తీసుకురావడం జరుగు తుందన్నారు. మంత్రిగా ఉండి, భూముల దోపిడీకి పాల్పడి, మత్స్యకారుల కోసం ఒకమినీ జెట్టీ కూడా నిర్మాణం చేయని సీదిరి నువ్వా కూటమి ప్రభుత్వాన్ని విమ ర్శించేది అని నిలదీశారు. శ్రీకాకుళంలో గల కోడి రామ్మూర్తి స్టేడియం త్వరలోనే పూర్తి చేయించి జిల్లా క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, నాయకులు సింతు సుధాకర్, సీర రమణయ్య, పాండ్రంకి శంకర్, రమణమూర్తి, మైలపిల్లి నర్సింహమూర్తి, రెడ్డి గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.