కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన పరిధిలో పంచలింగాల సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 380 టన్నుల ఇసుకను పోలీసులు సీజ్ చేశారు. సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ పీరయ్య, ట్రైనింగ్ సిబ్బంది దిలీప్ కుమార్, వీఆర్వో మద్దిలేటి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా ఇసుక నిల్వ ఉన్నట్లు గుర్తించారు. కొంత మంది వ్యాపారులే ఇసుక ను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఇసుకను సీజ్ చేసి మైనింగ్ అధికా రులకు అప్పగించారు.