ఆదివాసుల హత్యాకాండ దుర్మార్గమైనదని ఆదివాసం హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు విమర్శించారు. కర్నూలు స్థానిక ప్రగతిశీల మహిళా సంఘం భవనంలో వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన ఛత్తీ్‌స్‌ఘడ్‌లోని అబుజ్‌మాడ్-నారాయణపూర్ ఎనకౌంటర్ సంఘటనకు నిరసనగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు. వేదిక జిల్లా కన్వీనర్ అల్లాబకాష్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో వివిద సంఘాల నాయ కులు మాట్లాడారు. ముందుగా విరసం బాధ్యుడు పాణి మాట్లాడుతూ కార్పొరేట్‌్ కంపెనీల చేతుల్లో కీలుబొమ్మగా ఉంటున్న బీజేపీ ప్రభుత్వాలు అటవి సంపదలను దోపిడీ చేయడానికి అక్కడ ఉన్న ఆదివాసీలపై యుద్ధం చేస్తున్నాయన్నారు. అడవులను నిర్మూలించడానికి, అడవుల్లో నివసిస్తూ ఉన్న ఆదివాసాలను ఏరివేయడానికి ఆ ప్రాంతంలో వారికి మద్దతు గా ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం చత్తీష్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన కగార్ పేరిట దారుణమైన హత్యా కాండాను జరుపుతున్నాయనీ ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమైనవని ప్రభు త్వాలు జరుపుతున్న ఈ హత్యాకాండాలను ప్రాంత సమాజం, బుద్ధజీవులు ఖండించాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నాయకుడు రామకృష్ణారెడ్డి మాట్లా డుతూ అటవి ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను నిర్మూలిస్తున్నారని, ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 300 మంది ఆదివాసీలను అందులోనూ ఎక్కువ భాగం మహిళలను చంపేస్తూ మావోయిస్టులని ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే సైన్యం ఆదివాసులపై చేస్తున్న హంతక దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విరసనం నాగేశ్వరాచారి, కేఎనపీఎస్ బాధ్యుడు సుబ్బరాయుడు, సీపీఐ రామకృ ష్ణారెడ్డి, డీటీఎఫ్ రత్నంఏసేపు, ఎస్‌డీపీఐ చాంద్, రాయలసీమ విద్యావం తుల వేదిక భాస్కర్ రెడ్డి, ప్రజా పరిరక్షణ సమితి నాయకులు రవికుమార్, ఏపీసీఎల్‌సీ మాజీ కార్యదర్శి రాజసాగర్ పాల్గొన్నారు.