తూర్పుగోదావరి జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు(ఇస్-శానిటరీ లెట్రిన్) లేని జిల్లాగా ప్రకటించినట్టు కలెక్టర్ పి.ప్ర శాంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదే శాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 300 గ్రామ పంచాయ తీలు, రాజమహేంద్రవరం కార్పొరేషన్, కొవ్వూరు, నిడదవోలు మునిపిపాలిటీల పరిధిలో సర్వే నిర్వహించినట్టు చెప్పారు.
ఈ సర్వేలో జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ఎవ్వరూ లేరని, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయం, కార్పొరేషన్, మునిసిపల్ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. వాటి ఆధారంగా మాన్యువల్ స్కావెంజర్స్ ఫ్రీ, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేని జిల్లాగా ప్రకటించినట్టు చెప్పారు. ఈ విషయమై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 24లోపు సంబంధిత మునిసిపాలిటీ/మండల పరిషత్ అధికారుల ద్వారా మీ వివరాలు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ, సాధికారత కార్యాలయం, రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.