డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం విజయ దశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఆయుధ పూజ జరిపారు. అనంతరం ఆయుధపూజలో పాల్గొన్న వేద పురోహితుడు ఉపద్రష్ఠ విజయాదిత్య కత్తి విన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. విజయ దశమి సందర్భంగా అమలాపురం టౌన్ సీఐ వీరబాబు సమక్షంలో శాస్త్రోక్తంగా ఆయుధ పూజ చేసి, అనంతరం కత్తి యుద్ధ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://x.com/NaniVishal6/status/1845097459648954869?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1845097459648954869%7Ctwgr%5E7a3bb4d1f00620000945a1d1d58ee84a2a9ed1f2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FNaniVishal6%2Fstatus%2F1845097459648954869