రాయదుర్గం మండలంలోని జోరుగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో మొక్కజొన్న, టమోట, మిర్చి పంటలు నీట మునిగాయి. వడ్రవన్నూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి కల్వర్టు కుంగిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
గ్రామానికి చెందిన అనంతమ్మ, సావిత్రికి సంబంధించిన నాలుగు ఎకరాలలో వేసుకున్న చీనీచెట్లు నీట మునిగాయి. మూడు నెలల నుంచి వర్షంలోనే చెట్లు మునిగినట్లు తెలిపారు. నీరు నిరంతరం నిల్వ ఉండటంతో పిందెలు రాలిపోతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రిస్వామి మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. నిరంజనగౌడ్, సోమశేఖర్‌లు వేసుకున్న టమోట, మొక్కజొన్న, మిరప పంట నీట మునిగిపోయాయి.