గుత్తి మీదుగా వెళ్లే కాచిగూడ- మురడేశ్వర్-కాచిగూడ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (12789/90) రైలును మురడేశ్వర్ వరకూ పొడిగించినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-మంగళూరు ఎక్స్ప్రెస్ను ఈ నెల 11 నుంచి, దీని తిరుగు ప్రయాణపు రైలు గమ్యాన్ని 12వ తేదీ నుంచి పొడిగించినట్లు వివరించారు. ఈ రైలు మంగళూరు తర్వాత సూరత్కల్, ముల్కి, ఉడిపి, బర్కుర్, కుండపుర, మూకాంబికా నగర్ బైండూరు, భత్కల్ స్టేషన్ల మీదుగా మురడేశ్వర్‌కు చేరుకుంటుందన్నారు.