కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని, బ్లూ బ్యాచ్ ఆగడాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అనిపిస్తే ఎంతమాత్రం ఉపేక్షించమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వరదలొస్తే జగన్‌లా పరదాలు కట్టుకునట్లు.. సీఎం చంద్రబాబు అండ్ టీమ్ ఇంట్లో కూర్చోలేదన్నారు. మాజీ సీఎం జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుందని ఎద్దేవా చేశారు. గతంలో ఇలానే ఆత్మలతో మాట్లాడి కియా తమ ఘనతే అన్నారని, ఇప్పుడు టీసీఎస్ గురించి ఏ ఆత్మతో మాట్లాడారని ప్రశ్నించారు. జగన్ హయాంలో తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నామని.. ఇందుకు లూలూ, అశోక్ లైల్యాండ్ లే ఉదాహరణ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.