మహారాష్ట్రలోని అధికార మహయుతి ప్రభుత్వంపై విపక్ష మహా వికాస్ అఘాడి ఆదివారంనాడు విమర్శలు గుప్పించింది. ‘‘బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దొంగలు, ద్రోహుల నాయకత్వంలో ఆ పార్టీ పోటీ చేయక తప్పడం లేదు.
ముందు తమ సీఎం అభ్యర్థి ఎవరో వారిని ప్రకటించనీయండి. ఆ తర్వాత మా సీఎం అభ్యర్థి ఎవరో మీ అందరికీ తెలియజేస్తాం’’ అని ఉద్ధవ్ థాకరే అన్నారు.