పెద్దపల్లి: ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ అల్ఫ్రాగానస్ యూనివర్సిటీలో జరిగిన యునెస్కో ఆసియా పసిఫిక్ వ్యవస్థాపక విద్యా సదస్సుల్లో ఓదెల మండలం కొమిరకు చెందిన హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ కొత్తిరెడ్డి.
మల్లారెడ్డి ప్రసంగించారు. 21వ శతాబ్దంలో యువత ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను అధిగమించే విద్యా విధానాలపై వివరించారు. కార్యక్రమంలో 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.