తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుపాను సమయం లో తీవ్రమైన పెనుగాలులు వీచే అవకాశం, పిడుగులు పడే ప్రమాదం ఉంటుందన్నారు. పశువుల కాపరులు, రైతులు,ప్రజలందరూ అప్రమత్తంగా వుండి అవసరమైతే తప్ప బయటకి వెళ్లొద్దన్నారు. చెట్ల కింద, కరెంటు స్తంభాల కింద ఉండకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉంటు జాగ్రత్తలు వహించాలని, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు ఈ సమయం లో వేటకు వెళ్ళకుండా అప్రమత్తం గా ఉండి సురక్షిత ప్రాంతాలలో వుండాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ శ్రేణులు తుపాను కారణంగా ఇబ్బందులు పడే వారికి సహాయ సహకారాలు అందించాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.