తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలంలోని గుమ్మళ్ళదొడ్డిలో ఏర్పాటు చేసిన అస్సాగో ఇథనాల్ పరిశ్రమ వల్ల భవిష్యత్తులో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లనుం దని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మరోతి శివగణేష్ అన్నారు. కాలుష్య కారక పరిశ్రమైన ఇథనాల్ పరిశ్రమతో ఇబ్బందులు పడుతున్నామంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న మండలంలోని గుమ్మళ్ళదొడ్డి, అచ్యుతాపురం, బావాజీపేట, వెదురుపాక గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించి ఆందోళనకారులకు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో పరిశ్రమ నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించుకోవాలన్నారు. పరిశ్రమ నిర్వాహ కులు ఇచ్చిన సమయం మేరకు వేచి చూసి, అప్పటికీ దుర్వాసన నిలుపుదల కాకపోతే సంబంధిత సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ తరువాత ఆందోళనను ఉధృతం చేయాలన్నారు.
ఈ విషయంలో ప్రజలు చేపడుతున్న ఉద్యమానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సహ కారం కూడా పూర్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గుర్రాల రత్నాజీరావు, మాసారపు అప్పారావు, కొండా శ్రీను, బొల్లం బాపిరాజు, నల్లల వెంకన్నబాబు, అబిరెడ్డి రామభద్రం, అబిరెడ్డి నరేంద్ర, అధికార కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.