అమ్మాయే అబ్బాయైుతే.. విచిత్రంగా ఉంటుంది కదూ.. తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం పోతవరం గన్నమనేని కుటుంబీకుల పెళ్లి వేడుకలో ఇదే జరుగుతుంది.. వధువు వరుడు వేషధారణలో వధువు వరుడు వేషధారణ ధరించి గ్రామ దేవత గంగమ్మ తల్లి గుడికి వెళ్ల డం తరతరాలుగా అనవాయితీ.
గ్రామానికి చెందిన గన్నమనేని శ్రీనివాస్ కుమార్తె జ్యోతిర్‌నవ్య బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది.ఆమెకు వైరాకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చియించారు. శనివారం పోతవరంలో వధువు నవ్య వరుడు వేషధారణలో గంగలమ్మ తల్లి గుడి వెళ్లి దర్శించుకుంది.