తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.
ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి మంగళగిరి, తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. సివిల్ పోలీసుల ద్వారా విచారణ ఆలస్యం అవుతుందనే భావనతో విచారణను వేగవంతం చేసేందుకు సీఐడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.