భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. దాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు.
బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 గా ఉంటే దాన్ని రూ. 160 కు ప్రివిలేజ్ ఫీజు పెంచారు. దాంతో క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50 గా ఉంటే ఎపిఎఫ్ కలిపి దాని ధర రూ రూ.100 అవుతుందని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్ బాటిల్ ధర రూ. 99 కే నిర్ధారించినందున రూ. 100 ధరలో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.