పలాస రైల్వేస్టేషన్ మూడో నెంబరు ప్లాట్‌ఫారంపై ఆదివారం గుర్తుతెలియని యువకుడు(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామాఖ్య సూపర్‌ఫాస్ట్ రైలు ప్లాట్‌ఫారంపై గంటపాటు నిలిచిపోయింది. మృతదేహాన్ని తరలించిన అనంతరం రైలును యదాతధంగా పంపించారు. పోలీసులు కథనం మేరకు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కామాఖ్య రైలు పలాస మీదుగా భువనేశ్వర్ వైపు వెళ్తోంది. ప్లాట్‌ఫారంపై నుంచి గుర్తుతెలియని యువకుడు ఒక్కసారిగా రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.