ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ఘటాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూమ్‌ను మంత్రి పరిశీలించారు. సిరిమానోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. హోం మంత్రి వెంట ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితరులు ఉన్నారు.