హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం దక్కించుకున్న బీజేపీ రాష్ట్రంలో మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు (గురువారం) ఆ పార్టీ శాసనసభాపక్ష నేత నాయాబ్ సింగ్ సైనీ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు పంచ్‌కుల సెక్టార్ 5లో ఉన్న దసరా గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ కార్య్రమానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.ఇదిలా ఉంటే సైనీ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ (Defence Minister Rajnath Singh) లతో పాటు అస్సాం సీఎం హింతమ బిశ్వ శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహరాష్ట్ర సీఎం ఎక్నాథ్ షిండే, కేంద్ర మంత్రలు, ఎన్డీఏ నేతలు తదితరులు హాజరయ్యారు