తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట భార్య భైఠాయించిన సంఘటన బుధవారం ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడేకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సురేష్‌కు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రాజేశ్వరి అనే మహిళను ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లైన రెండేళ్ల నుంచి భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఆమె వాపోయింది. తనకు ముగ్గురు సంతానం ఉన్నారని తన భర్త సురేష్ తాగుతూ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎమ్మిగనూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.