పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
దీంతో ఈ పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా రక్షణ పొందవచ్చు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచి వర్తింపులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.