కాకినాడలో మొదటిసారిగా ఐపీఎల్ తరహాలో జీపీఎల్ ప్రీ మియర్‌లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండ డం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. డిసెంబరు 1 నుంచి 12 వరకు గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహిస్తారన్నారు. ఆదివారం ఆయన నివాసంవద్ద టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12రోజులపాటు జరిగే ఈ టోర్నమెంటులో ఆరు జట్లుగా ఏర్పా టుచేసి పోటీలు పెడతారన్నారు.
మిరాకిల్ ఇం జనీరింగ్ సౌజన్యంతో ఏర్పాట్లు చేస్తారన్నారు. అమ్పీఫ్లై స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి ఎస్.కరుణాకర్ మాట్లాడుతూ డేవిడ్ కాకినాడ కింగ్స్, చిట్ల కిరణ్ పిఠాపురం పాంథర్స్, హరీష్ కోనసీమ లయన్స్,లోవస్ రామచంద్రపురం రాయల్స్, జీ వీ కే తుని డస్కస్, షణ్ముఖ గోదావరి రైడర్స్ జట్ల మధ్య పోటీలు నిర్వహిస్తామన్నారు. టో ర్నమెంట్‌కు వైస్‌చైర్మన్‌గా చిట్టూరి డేవిడ్ వ్యవ హరిస్తారన్నారు. ఆటగాళ్లకు వేలం నిర్వహించి 20-20తరహాలో పోటీలకు శ్రీకారం చుట్టారు.