భవిష్యత్తులో డేటా ఆస్తిగా మారుతుందని, మీ దగ్గర డేటా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాడి అద్బుతాలు చెయ్యెచ్చునని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ లకు ప్రోగ్రాం ఇచ్చి ఇన్మర్మెషన్ తెప్పించుకోవచ్చునని, వరదల సమమంలో ఆహారాన్ని ఫుడ్ సప్లైకి వాడామని చెప్పారు. లక్షా 50 వేల మందికి డ్రోన్ ద్వారా ఆహరం అందించామన్నారు. సిటీలో ఎంత చెత్త పేరుకుపోయిందో డ్రోన్ లు పంపి తెలుసకున్నామన్నారు. దీంతో ఆ చెత్తను వెంటనే ఎత్తేశామని, రేపు ఇదే డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతందని ఆయన పేర్కొన్నారు. దీన్ని వ్యావసాయం, మూళిక సధుపాయాలు విషయంలో వాడడం ద్వారా అద్బుతాలు సాధించొచ్చునని అన్నారు. వాటిని ట్రాఫిక్ వైలేషన్, డ్రంకన్ వైలేషన్‌లు జరగకుండా చూస్తున్నామని, భవిష్యత్తులో తప్పుచేసి వారిని పట్టుకోవడానికి డ్రోన్‌లు వాడుతామని చెప్పారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మీకు చెప్పదల్చుకున్నానని.. డ్రోన్ తయారీ దారులకు ఈ సదస్సు ద్వారా ఓ అవకాశం వస్తుందన్నారు. ఇప్పుడు కొన్ని దేశాలు డ్రోన్ లను యుద్దాలకోసం వాడుతున్నారని.. తాను మాత్రం డ్రోన్ ద్వారా డెవలెప్‌మెంట్ చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.