ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు తాము మరోసారి అధికారంలోకి వస్తామని నమ్మిన వైసీపీ (YCP) కేవలం 11 సీట్లకే పరిమితమైంది.అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ఆ పార్టీకి చెడ్డ పేరును తీసుకొచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డి , కాదంబరీ జత్వానీ కేసు జగన్ ప్రభుత్వానిక (కు మాయనిమచ్చను మిగిల్చాయి. ఇక తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహరం వైసీపీ (YCP)ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే వైసీపీ (YCP) తన 'X' ఖాతాలో (ట్విట్టర్) వేదికగా సంచలన పోస్ట్ చేసింది. 'ట్రూత్ బాంబ్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు డ్రాప్ అవుతోంది. స్టే ట్యూన్' అంటూ ట్వీట్ చేసింది. అందుకు సంబంధించి 'ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్' అనే పోస్టర్‌ను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ, కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ వ్యవహారాన్ని బయటపెట్టపోతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
Get ready for the truth bomb Dropping on 24th Oct at 12 PM!
Stay tuned ❗#BigExpose pic.twitter.com/IxkzYt2N4x
— YSR Congress Party (@YSRCParty) October 23, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa