మంగళవారం తూర్పు మధ్య బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర వాయుగుండం బలపడి, ‘దానా’ తుఫానుగా మారి, వాయువ్య దిశగా గత 6 గంటలలో గంటకు 15 కి.మీ వేగంతో కదిలి, బుధవారం అనగా అక్టోబర్ 23వ తేదీ ఉదయం 08.30 గంటలకు అదే ప్రాంతంలో 16.5° ఉత్తర అక్షాంశం, 89.6° తూర్పు రేఖాంశం వద్ద..దాదాపు పారాదీప్(ఒడిశా)కు ఆగ్నేయంగా 520 కి.మీ.. సాగర్ ద్వీపం(పశ్చిమ బెంగాల్)కు ఆగ్నేయంగా 600 కి.మీ.. ఖేపుపరా(బంగ్లాదేశ్)కు దక్షిణ-ఆగ్నేయంగా 610 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.ఇది వాయువ్య దిశగా పయనించి, 24వ తేదీ తెల్లవారుజామున, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడుతుంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల దగ్గర, పూరి, సాగర్ ద్వీపం మధ్య, భిటార్కనికా, ఢమరా(ఒడిశా)కు దగ్గర 24వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 25వ తేదీ ఉదయానికి, తీవ్రమైన తుఫానుగా గాలి గంటకు 100-110 కిమీ వేగంతో, గరిష్టంగా 120 కిమీ వేగంతో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య లేదా ఉత్తర దిశగా గాలులు వీస్తున్నాయి.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-ఈరోజు, రేపు:-తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఎల్లుండి:-తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఈరోజు, రేపు, ఎల్లుండి:-తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.