గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహన మృతి చెందడం బాధాకరం అని మాజీమంత్రి ఆర్కే రోజా అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో, మహిళ హోంమంత్రి గా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహానా ను హత్య చెయ్యడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి లే బాధ్యత వహించాలి. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన సహాన కి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ వెళ్లి వైద్యులను అదేశించకపోవడం అమానవీయం.
ఇంకా ఎంత మంది అడబిడ్డలను బలి తీసుకుంటారు..? టీడీపీ నేతలు, రౌడీ షీటర్ల నుండి మహిళల మాన, ప్రాణాలను ముప్పు ఉంది. తక్షణమే సహానా ను హత్య చేసిన టీడీపీ రౌడీ షీటర్ నవీన్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. రియాలిటీ షో కి వెళ్లి వినోదం పొందిన సీఎం చంద్రబాబు ఇప్పుడు సహాన తల్లి కన్నేటికి ఏం సమాధానం చెప్తారు..? సహాన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ఆర్కే రోజా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.