జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీ చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లడం జగన్ క్రూర మనస్తత్వానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. అసలు ఆస్తి కోసం తల్లీ - చెల్లిని బ్లాక్మైల్ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అని పిలవాలన్నా అసహ్యం వేస్తోందని సోమిరెడ్డి అన్నారు. జగన్ అనుభవిస్తున్న ఆస్తి ప్రజలదని తెలిపారు. సరస్వతీ పవర్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమి 30 ఏళ్ల లీజును జగన్ పొడిగించుకున్నారన్నారు.
ప్రజల సొమ్మును వీళ్లకు ఎందుకు దారాదత్తం చేయాలని ప్రశ్నించారు. జగన్ ఒప్పుకుంటే సరస్వతీ పవర్ 1500 ఎకరాలను మూడు భాగాలు చేసి ఒక భాగం రైతులకిచ్చి, మిగిలిన రెండు భాగాలను జగన్, షర్మిలకు సమానంగా పంచుతామని తెలిపారు. తండ్రిని ఈడీ కేసులో ఇరికించి, ఆస్తి కోసం తల్లీ - చెల్లిపై కేసుపెట్టడం ఎక్కడా చూడలేదన్నారు. అలాంటి జగన్ నోట తల్లీ, చెల్లీ అనే మాటలు వినలేకపోతున్నామని సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.