హనీ ట్రాప్ కేసులో జాయ్ జమీమా కథలు ఒక్కోటిగా బయటికొస్తున్నాయి. పదుల సంఖ్యలో బాధితులను మోసం చేసింది జమీమా. సోషల్ మీడియా వేదికగా యువకులకు వలపు వల విసిరి. వారి నుంచి లక్షలకు లక్షలు లాగేసినట్లు తెలుస్తోంది. జమీమాను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు కంచెరపాలెం పోలీసులు. శనివారం మొబైల్ డేటా ఆధారంగా అనేక ప్రశ్నలు వేశారు. అయితే ఆమె పోలీసులకు ఎటువంటి సమాధానాలు చెప్పడం లేదు.