క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్ ఎస్ చాంగయ్య కోరారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గత ఐదు రోజులుగా కార్పొరేషన్ పరిధిలో 64 మంది ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. వెంటనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.