ఆముదాలవలస మండలం దూసి గ్రామం కుమ్మరి వీధిలో మంచినీటి కులాయిచుట్టు మురుగునీరు నిల్వ ఉంటుందని స్థానికులు ఆదివారం తెలిపారు. ఆర్ అండ్ బి రోడ్డు కింద నుంచి మురుగునీరు వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ అందులో మట్టి పేరుకుపోవడంతో ఈ సమస్య ఏర్పడిందన్నారు.
ఫలితంగా మంచినీళ్లు పట్టుకునేందుకు వెళితే మురుగునీటి వాసనతో అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.