శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట రైల్వే స్టేషన్ ను నూతనంగా ఏర్పాటయ్యే విశాఖపట్నం రైల్వే జోన్ లో విలీనం చేయాలని కంచిలి మండల రైల్వే స్టేషన్ వినియోగదారుల సంఘం సభ్యులు కోరారు.
ఈ మేరకు ఆదివారం కంచిలి పట్టణంలోని సోంపేట రైల్వే స్టేషన్ ఆవరణలో వినియోగదారుల సంఘం సభ్యులు నిరసన తెలిపారు. సోంపేట రైల్వే స్టేషన్ ను విశాఖ రైల్వే జోన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్ అభివృద్ధికి రైల్వే అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.