దీపావళి ఆ ఇంట విషాదం నింపింది..పండుగను పురస్కరించుకుని నార బాంబులు చుడుతుండగా పెనుప్రమాదం సంభవించింది... ఆద మరిస్తే ఎంత ప్రమాదమో చాటిచెప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద పంచాయతీ ఆరో వార్డు రామాలయం వీధిలో కల్లి వెంకటకృష్ణ(30) రెండు పోర్షన్ల ఇంట్లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దీపావళిని పురస్కరించు కుని తన ఇంట్లో భార్య జయశ్రీతో కలిసి అవుట్లు తయారు చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం రెండు న్నర గంటల సమయంలో ఒక్కసారిగా మందుగుండు సామగ్రి పేలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో అతని పెంకు టిల్లు పైకప్పతో సహ, సమీపంలో ఉన్న వంటషెడ్డు(రేకులషెడ్డు) కుప్ప కూలిపోయాయి. పేలుడు ధాటికి వెంకట కృష్ణ తీవ్రగాయాలపాలయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెంది న ట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య జయశ్రీకి తీవ్రగాయాలు కాగా ఆమెను మండపేట ఆసుపత్రికి తరలిం చి మెరు గైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మృతుడు వెంకట కృష్ణ తండ్రి శ్రీనివాస్, తల్లి సావిత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. ఒక్కసారిగా పేలు డు సంభవించడంతో వారిద్దరూ తీవ్రగా యాలపాల య్యారు. 108లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.
మృతుడు వెంకటకృష్ణ కు ఏడాది బాబు ఉన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండడంతో క్షేమంగా బయటపడ్డాడు. ఘటనా స్థలాన్ని రామ చంద్రపురం డీఎస్పీ రామకృష్ణ, రూరల్, సీఐ పీతల దొరైరాజు, రూరల్ ఎస్‌ఐ సురేష్‌బాబు, జిల్లా పైర్‌అధికారి పార్థసా రథి, మండపేట పైర్ అఽధికారి హను మంతరావు పర్యవేక్షించారు. మండపేట తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరు కుని విచారణ చేపట్టి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రుల కు మెరుగైన వైద్య సేవలందించాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. బాధి త కుటుంబానికి న్యాయం జరిగేలా చర్య లు తీసుకుంటామని చెప్పారు.