కురుపాం నియోజకవర్గం పరిధిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరగాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం జియ్యమ్మవలసలో టీడీపీ మండలాధ్యక్షుడు పల్ల రాంబాబు అధ్యక్షతన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆమె తో పాటు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేశ్, దత్తి లక్ష్మణరావు, అరకు పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపీపీ బొంగు సురేష్ తదితరులు పాల్గొన్నారు.