ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద గంటపాటు నిరసన తెలిపారు. నాయకులు మారుతి గోవర్ధన్, డివైఎఫ్ఐ నాయకులు మైన మాట్లాడుతూ........ ప్రభుత్వం విద్యార్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భోజన పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ గోవింద్ సింగ్కు వినతిపత్రం అందించారు.