రాష్ట్ర రవాణా,యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో అధిక సంఖ్యలో వినతిపత్రాలు అందాయి. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.
రాయచోటి నియోజకవర్గంలో భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గతంలో భూ దోపిడీకి పాల్పడిన వారి నుంచి భూములు స్వాధీనం చేసుకొని పేదలకు ఇస్తామన్నారు. జిల్లాలోని అధికారులందరూ బాధితుల సమస్యలను సీరియస్‌గా తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి అప్యాయంగా పలుకరిస్తూవారి నుంచి అర్జీలు స్వీకరించారు.