కడప నగరంలో ఇంటింటా చెత్త సేకరణ వంద శాతం నిర్వహించాలని కమిషనర్ ఎన.మనోజ్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం కడప కార్పొరేషన వీడియో కాన్ఫరెన్స హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నగరంలో ఉన్న కమర్షియల్ షాపుల ట్రేడ్ లైసెన్సు వివరాలు సకాలంలో అందించాలని సూచించారు.
అలాగే చెత్తపాయింట్ల చెత్త తీసిన వెంటనే బ్లీచింగ్ చేసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలన్నారు. ప్లానింగ్ విభాగంలో జాప్యం లేకుండా వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ చేసి త్వరితగతిన అప్రూవల్ చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్ రాంబాబు, మున్సిపల్ ఎంహెచఓ చంద్రశేఖర్, ఈఈ నారాయణస్వామి, ధనలక్ష్మి, అసిస్టెంటు సినీ ప్లానర్ మునిరత్నం పాల్గొన్నారు.