ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నవంబరు 1న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సభా వేదిక, హెలీప్యాడ్ కోసం అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ నియోజకవర్గంలో పర్యటించారు.
సోంపేట మండలం కొర్లాం పంచాయతీ గొనకపాడు, బారువ రైల్వే గేట్ సమీపంలోని స్థలాలను పరిశీలించారు. కంచిలి మండలం పద్మతుల గ్రామ సమీపంలో స్థలాన్ని కూడా పరిశీలన చేశారు. వీటితోపాటు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం వద్ద స్థలాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో పలాస ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం తహసీల్దార్లు అప్పలస్వామి, రమేష్‌కుమార్, వెంకటరావు, సీఐలు బి.మంగరాజు, చిన్నంనాయిడు, ఎస్ఐలు చంద్రశేఖర్, జి.రాజేష్, ఈ.శ్రీనివాసరావు కూటమి నాయకులు పాల్గొన్నారు.