ఎలకా్ట్రనిక్ వెహికల్స్(ఈవీ) పరిశ్రమకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశమని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థ టెస్లాను ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆస్టిన్ నగరంలోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఈవీల తయారీ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న టెస్లా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్(సీఎ్‌ఫఓ) వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. టెస్లా తన యూనిట్‌ను ఏపీలో స్థాపించే అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై మంత్రి వివరించారు. ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల స్థాపనకు అనంతపురం వ్యూహాత్మక కేంద్రమని వెల్లడించారు. బెంగళూరు, చెన్నై నగరాలకు సమీపంలో ఉన్న ఈ జిల్లా పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రదేశమని తెలిపారు.