ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. నవంబరు 2న చంద్రబాబు గజపతినగరం మండలం పురిటిపెంటకు వెళ్లనున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు కొత్తవలస మండలం దెందేరు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పర్యటన దెందేరు నుంచి పురిటిపెంటకు మారింది. పురిటిపెంట పర్యటనలో చంద్రబాబు రోడ్డుపై గుంతలు పూడ్చే పనుల్లో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.826 కోట్లతో రహదారి మరమ్మతు పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళ్లనున్నారు. నవంబరు 2వ తేదీ మధ్యాహ్నం విశాఖ కలెక్టరేట్ లో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అంతేకాదు, విజన్-2047 డాక్యుమెంట్ తయారీకి వివిధ భాగస్వాములతో సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు రేపు (నవంబరు 1) శ్రీకాకుళం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.