కలిగిరి మండలంలో దీపం పథకంను ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తో కలిసి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. చంచల బాబు యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇప్పటికే నాలుగు పథకాలు అమలు చేశారని, అన్న క్యాంటీన్, 4వేల రూపాయల పెన్షన్, ఉచిత ఇసుక, ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం పథకాలను ప్రారంభించారన్నారు.