ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భర్త, కుమారుడితో కలిసి రోడ్డు దాటుతున్న ఒక మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడిన ఆమెను కొంత దూరం వరకు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa