ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషప్రచారం ఆపకపోతే సహించేది లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 03, 2024, 04:11 PM

ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాక, వైయ‌స్‌ జగన్‌ కుటుంబం మీద, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో రకమైన అబద్ధపు ప్రచారం చేసి పబ్బం గడుపుకొంటున్న సీఎం చంద్రబాబు, ఇకనైనా విషప్రచారం ఆపకపోతే తాము కూడా ఘాటుగానే బదులివ్వాల్సి ఉంటుందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.


ఎన్నికలకు రెండేళ్ల ముందు విజయమ్మ కారు టైరు పగిలిపోతే, ఆమె హత్యకు వైయ‌స్‌ జగన్‌ కుట్ర చేశాడంటూ టీడీపీ అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో చంద్రబాబు, లోకేష్‌  ప్రచారం చేయిస్తున్నారని, దీన్ని పట్టుకుని ఎల్లో మీడియాలు కధనాలు రాయడం, వాటిపై టీవీల్లో డిబేట్లు పెట్టించడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ఇంకా దిగజారి తల్లిని ఎలా చూసుకోవాలో టీడీపీ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ వారితో చిలకపలుకులు పలికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తరహాలో చంద్రబాబు కుటిల రాజకీయాలు దశాబ్దాలుగా చూస్తున్నామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com