దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలో అర్హత కలిగిన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కార్డులను రీ డిజైన్ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్‌తో అందజేసేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. రేషన్‌కార్డుల రూపకల్పన, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా అర్హులైన పేదలకు కొత్త కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు చేస్తోంది. కొత్తకార్డులకు అధికారులు డిజైన్లు పరిశీలిస్తున్నారు. వాటిలో లేత పసుపు రంగు కార్డుపై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు.