కూటమి ప్రభుత్వంపై వైసిపీ గత నాలుగు నెలలుగా విష ప్రచారం చేస్తుందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ... ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు, పోలవరం ప్రాజెక్టులపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి సుభాష్ ఖండించారు.
నిత్యావసర వస్తువుల ధరలపై డిబేట్‌కు సిద్ధమని మంత్రి సుభాష్ తెలిపారు. ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్త శుద్ధితో పని చేస్తున్నారని అన్నారు. అమరావతి రాజధానిని సరైన ట్రాక్‌లో పెట్టి అభివృద్ధి చేయడానికి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు కానుకగా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో రూ. 11వేల 762 కోట్లతో 73 శాతం పనులు చేసిందని అన్నారు. వైసిపీ ప్రభుత్వ హయాంలో రూ. 4,100 కోట్లతో 3.82 శాతం మాత్రమే పోలవరం ప్రాజెక్టు పనులు చేసిందని మంత్రి సుభాష్ వెల్లడించారు.