నామినేటెడ్ పదవులు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి సారించామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ(ఆదివారం) కూటమి పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఏపీ మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నెల్లూరు జిల్లా సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
జిల్లా అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నీటి సంఘాల ఎన్నికలు పార్టీ నామినేటెడ్ పోస్టులపై ప్రధానమైన చర్చ సాగిందని అన్నారు. మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ, పాత ఫార్ములాతోనే ముందుకెళ్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.