ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమని ఒప్పుకోలేదని బాలికని చంపిన దుర్మార్గుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 03, 2024, 07:34 PM

అక్టోబర్‌ నెలలో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది చేసిన పనికి ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో ఈ ఘటన జరిగింది. నగరూరుకు చెందిన వీరేశ్ అదే గ్రామానికి చెందిన అశ్విని అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ కొద్ది రోజులుగా వెంటపడుతున్నాడు. తనకు ఇష్టం లేదని చెబుతున్నా కొద్దిరోజులుగా అమ్మాయిని వీరేశ్ వేధిస్తున్నాడు. తాజాగా ఎవరూ లేని సమయం చూసుకుని బాలిక ఉంటున్న ఇంట్లోకి చొరబడిన వీరేశ్ ప్రేమించాలంటూ బలవంతం చేశాడు. ఆ తర్వాత అమ్మాయిపై అత్యాచారయత్నం చేయగా.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది.


దీంతో బలవంతంగా ఆమె నోట్లో పురుగుల మందు పోసి వీరేశ్ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్న అశ్వినిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో బాలిక మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరుకు చెందిన అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. గత కొంతకాలంగా అశ్వినిని ప్రేమిస్తున్నానంటూ వీరేశ్ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. సెలవులకు ఇంటికి వచ్చిన అశ్వినిని కలిసిన వీరేశ్ తనను ప్రేమించాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించారు. తనకు ఇష్టం లేదని చెప్పినా వీరేశ్ వినలేదు. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి యత్నించాడు. అశ్విని ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుమందు తాగించాడు. పెనుగులాటలో వీరేశ్ కు కూడా గాయాలయ్యాయి. ఇక, పొలం పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులు చావు బతుకుల్లో కనిపించిన అశ్వినిని చూసి షాకయ్యారు. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అశ్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. కన్నీరు మున్నీరవుతున్నారు.. ప్రేమ పేరుతో తన కూతురు వేధింపులకు గురి చేసి, అత్యాచార యత్నం చేసిన ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com