విశాఖలో రుషికొండ ప్యాలె్‌సను చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో నిబంధనలను ఇంతగా ఉల్లంఘించగలరా అని ఆశ్చర్యం, ఉద్వేగం కలుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారం అడ్డం పెట్టుకుని చేసిన విధ్వంసం, బరితెగింపుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఆయన రుషికొండపై ప్యాలె్‌సను సందర్శించారు. నాలుగు బ్లాక్‌లను నిశితంగా పరిశీలించారు. ప్యాలెస్ బ్లూప్రింట్‌తోపాటు వైశాల్యం, ఒక్కో బ్లాక్‌లో నిర్మాణాల ప్రత్యేకతలు, ఇంటీరియర్, ఫ్లోరింగ్, సీలింగ్ ఫ్యాన్లు, బాత్‌టబ్‌లు, ఇతర సౌకర్యాల గురించి ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అభిషిత్ కిషోర్, పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్.... చంద్రబాబుకు వివరించారు.
విజయనగర బ్లాక్‌లోని విలాసవంతమైన బాత్‌రూమ్‌లు, మసాజ్‌రూమ్, మరుగుదొడ్డి కమోడ్‌లు, ఫ్యాన్‌లు, కళింగ బ్లాక్‌లోని విశాలమైన సమావేశ మందిరం, గజపతి, వేంగీ బ్లాక్‌లలో విదేశాల నుంచి తెప్పించిన రాజరికం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫర్నిచర్, ఇంటీరియర్‌ను చూసి చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నాగరిక ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అన్నట్టు రుషికొండ ప్యాలె్‌సను నిర్మించారు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం, స్వార్థం కోసం ఇంతగా బరి తెగించాడా? అని మైండ్‌బ్లోయిం గ్ అయింది. అందుకే జగన్‌ను నేను ‘ఆంధ్రా ఎస్కోబార్’ అనేది.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.