చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయి. ఒక మాఫీయ రాజ్యం ఏలుతుందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారు. పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.
నాలుగు నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాం. అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారు అని మండిపడ్డారు.